Dear Lord's relatives,
Srimathe: Na:ra:yana:ya Namaha
May auspiciousness be conferred upon you!
We pray that Nandana Na:ma New year bestow prosperity, happiness, peace, and fill your life with service to Sriyah pathi and His devotees.
Nandana Traditional New year - Sri Rama Navami - Vasanthothsavams
In Divya saketham (Samshabad, Hyderabad), under the supervision of His Holiness Sri Sri Sri Thridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamiji, Sri Ramanavami from 23 March to 1st April and Vasanthothsavam from 02 April to 06 April will be celebrated.
In the divine presence of HH Sri Chinna Jeeyar Swamiji & HH Sri Ahobila Jeeyar Swamiji, Goda Kalyanam was grandly performed here at Siddipet along with large number of devotees.
- Photos
2012 Jan 11: Vijayawada: Goda Kalyanam: In the divine presence of HH Sri Chinna Jeeyar Swamiji & HH Sri Ahobila Jeeyar Swamiji, Goda Kalyanam was grandly performed here at Vijayawada along with large number of devotees on January 11, 2012.
- Photos
ప్రియ భగవద్బంధువుల్లారా!
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయన రామానుజ చిన్న జీయర్ స్వామి వారు మన అందరిచేత ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతంతో పాటుగా శ్రీ వేంకటేశ్వర శరణాగతి దీక్షను ప్రసాదించారు. శ్రీ స్వామి వారి సంకల్పంతో మనం ఆచరిస్తున్నాం. ఈ సంవత్సరం సహస్ర తులసీ శ్రీనివాసమ్-శరణాగతిగోష్టి కార్యక్రమాన్ని ప్రసాదించారు. అయితే ఇవన్నీ ఎందుకు ఆచరిస్తున్నామో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
తిరుప్పావై వ్రతంలో మన ఆండాళ్ తల్లి ఇటు జీవునికి అటు పరమాత్మకి పాటం నేర్పి ఇరువురిని ఒక వద్దకు చేర్చిన ఉపకారకురాలు అని పెద్దలు కొనియాడారు. ఆ తల్లి వ్రతంలో వేంకటాచలపతికి శరణాగతి చేసింది, అదే మార్గాన్ని చూపిస్తూ మనందరికి పరమాత్మ స్వరూపాన్ని శ్రీవేంకటాచల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు మన స్వామి వారు. లోకరక్షణకై పరమాత్మ వేంకటాచలాన్ని తన స్థానంగా ఎంచుకున్నాడు, అట్లాంటి స్వామికి ఎటువంటి కైంకర్య లోపాలు జరగకూడదు అని ఇటు మనకి అటు పెరుమాళ్ళకి(వేంకటేశునికి) మంగళాశాసనాలు చేస్తూ లోకోపకారం చేస్తున్నారు మన స్వామి వారు. దీనికి తోడుగా సహస్ర తులసీ శ్రీనివాసమ్ - శరణాగతుగోష్టి కార్యక్రమంలో భగవంతుణ్ణి వ్యాపార దృష్టిలో వాడరాదు, ఆలయాల చరిత్రని పాడుచేయరాదు, చరిత్రకు చిహ్నాలైన కట్టడాలని మార్పుచేయడం, కూలదోయడం వంటివి చేయరాదని వాటిని రక్షించుకోవడం మన భాధ్యత అని గుర్తుకు చేస్తున్నారు మన స్వామి వారు.
వీటికి ముందు తెలియాల్సింది అక్కడ జరుగుతున్నదేమిటి ? "కంటి నఖిలాండ కర్తనధికుని గంటి ..బహు విభవముల మంటపములు గంటి" అని పాడుకున్న మన సంకీర్తనాచార్యులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు పాడిన మండపాదులు ఈ నాడు ఏమైయ్యాయి ? ఈ వేళ తిరుమలలో వేయికాళ్ళ మండపాన్ని కానీ, పూర్వాచార్య గృహాలని కానీ, మాడ వీదులని నాశనం చేస్తున్నారు. చరిత్రని తుడిచి వేస్తున్నారు. దేవుని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారు. కొండమీది వ్యవస్థను 11 వ శతాబ్దంలో రామానుజులవారు క్రమబద్ధం చేసినప్పుడు అక్కడ ఒక జీయరును ఏర్పాటు చేసి, ఆ జీయరు స్వామితో నలుగురు ఏకాంగులని పెట్టి, ఆ జీయరు స్వామికి కొన్ని గుర్తులు ఇచ్చారు. "హే జీయరు స్వామిన్! మీరు ఈ వేంకటేశ్వర స్వామికి సేవలు ఎట్లా చేయాలంటే రామ సేవ కోసం హనుమ ఎట్లా అయితే స్పందించాడో అట్లా చేయాలి" .
రామ సేవ కోసం హనుమ లంకకి వెళ్ళమంటే ఒంటరిగా వెళ్ళగలిగాడు. రావణ సభలో ఆతడి సైన్యం ముందర నిలబడి తోకకు చుట్టి నిన్ను రాముడి పాదాల వద్ద వేయగలను జాగ్రత్త అని చెప్పేంత సాహసంతో వెళ్ళాడు. దేవుడి సేవలో ఎట్లాంటి అపచారాలు జరగటానికి వీలు లేదు. అందుకే హనుమంతుడి జెండా, హనుమంతుడి ముద్రిక, హనుమంతుడి తాళం చెవి, హనుమంతుడి ఉంగరాన్ని ఇవన్నీ వారికి ఏర్పాటు చేయించి ఇచ్చారు. రామానుజులవారు ఇవన్నింటినీ హనుమంతుని సంబంధంతో ఏర్పాటు చేయించి ఇచ్చారు. హనుమంతుని సన్నిధికి ప్రక్కనే వారి మఠాన్ని కట్టించి, రాముని వద్ద హనుమ ఎట్లా అయితే ఉన్నాడో ఈ వేంకటేశుడి వద్ద మీరూ అట్లా ఉండాలి అని జీయర్ స్వామికి తామారాదిచుకొనే రామచంద్రుణ్ణి ఇచ్చారు రామానుజులవారు. ఇది చరిత్ర. దురదృష్టం ఏమిటంటే రామానుజులవారు ఏర్పాటుచేసిన మఠాన్ని కూడా తీసివేద్దాం అని అనుకున్నారు, అదృష్టం బాగుండి స్వామి అట్టే పెట్టుకున్నాడు. పెరుమాళ్ళకి(వేంకటేశునికి) సరిగ్గా ఆరగింపులు లేవు. ఆయనకి చేయవలసిన సమయానుకుల పవళింపు సేవలు లేవు. భక్తుల సౌకర్యార్థం అని చెప్పి ఇవన్నీ చేస్తున్నారు.
@Kukatpally @Karimnagar @Warangal


@Suryapet @Gudivada @Pedavadlapudi


@Ongole @Vizianagaram @ Bobbili




ఏ జాతి చరిత్రహీనులం కావాలని అని కోరుకోదు. తమ చరిత్రను సంరక్షించుకోవాలని అనుకుంటారు. సుమారు నూరు నూటయాభై ఏండ్ల క్రితం ఏర్పడ్డ దేశాల వాళ్ళే తమ చరిత్రను పదిలంగా ఉంచుకుంటున్నారో గమనిస్తే తెలుస్తుంది. రోమ్ లో ఒక చర్చిలో మా పన్నెండో శతాబ్ధపు గుర్తు అని ఒక గోడను అట్లే పెట్టుకున్నారు. మన మందిరాలని మన ఆచారాలని అగౌరవపరిచే స్థితిలో ఉన్నామే, తగదిది. చరిత్రని మనం పోనివ్వద్దు. వేంకటేశుడు మనకోసం ఈ నాటికీ ఎన్ని లీలలు ప్రదర్శించాడు. వెంగమాంబను కాదంటే తన ఇంటిముందరికి రథాన్ని వచ్చి ఆగిపోయేట్టు చేసాడే, ఇప్పటి చరిత్ర అది. అంతకు ముందు అన్నమాచార్యులకి ఎన్ని అనుగ్రహాలు అందించాడు స్వామి. అంతకు ముందు అనంతార్యుకి ఏమీ చేతకాని ఆవిడలా అమ్మ తోటలో దొరికిపోయి ఆయనచే కట్టించుకొని ఆయన చేతులు మీదిగా స్వామిని చేరి అనంతార్యులని స్వామికి మామగారు అయ్యేట్టు చేసిందే. ఇది మన మధ్య ఉండే చరిత్య. దీనికి గుర్తుగానే స్వామికి అప్రదక్షిణం బ్రహ్మోత్సవాల్లో ఒక ఉత్సవంగా తిలకిస్తున్నాం ఈనాటికీ. దేవుడు కనిపిస్తాడు, మాట్లాడుతాడు. మీరు పూజించుకునే విగ్రహంలోనూ ఉంటాడు. కానీ మనం ఎక్కడికో వెళ్తే మాత్రమే దేవుడు కాదు, ముందు మీ ఇంట్లో దేవుణ్ణి విశ్వసించండి. అప్పుడు ఆలయాల్లో దేవుణ్ణి చూసి స్పూర్తి పొందండి. చరిత్ర చిహ్నాల్ని బద్రపరిస్తే జాతి చరిత్ర ప్రపంచంలో నిలుస్తుంది. వందలు కాదు వేలు కాదు ఈ మాన జాతి చరిత్ర కోట్ల సంవత్సరాలుగా వస్తున్నది అని చెప్పడానికి నిదర్శనాలుగా నిలబడ్డ స్థానాలు ఆలయాలు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఆలయాలు కేవళం ప్రార్థనా స్థానాలు మాత్రమే కాదు. ఆరాధనతో పాటు జాతి చరిత్రను కాపాడే స్థానాలు. భగవంతుణ్ణి దర్శించుకోవడానికి మాత్రమే ఆలయాలు కావు. భగవంతుడు అణువణువునా నిండి ఉంటాడని వింటున్నాం. ప్రహ్లాదాది చరిత్రల్లో స్మరించాం. మనకు చూడటానికి ఒక విగ్రహ రూపంలో ఒక మూర్తిగా మన ఇంట్లో సాక్షాత్కరిస్తాడు. మన కోసం వచ్చిన రూపం కనుక మన అవసరాలకు తగ్గట్టుగా వస్తాడు. గాలి మనకు కావాలంటే దానికి తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాం. అట్లానే దైవం మన కోసం మన మాటలు వినడానికి చిన్ని రూపంలో వస్తాడు. అక్కడ మంత్రాలు కోరడు, మాటలే కోరుతాడు. సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి సమాజానికి కావల్సిన సంస్కారాన్ని అందించడానికి ఆలయాన్ని నిలయం చేసుకుంటాడు. అక్కడ మంత్రాలని శ్రవణం చేస్తాడు. ఆలయం అనేది సంస్కారానికి చరిత్రకి నిలయం. చెప్పాలంటే తీర్థం ప్రసాదం పుచ్చుకోవడానికి ఇల్లు చాలు. దైవదర్శనంతో పాటు సంస్కృతి సంప్రదాయాల్ని గుర్తించేట్టు చేసేటటువంటి స్థానాలు ఆలయాలు. ఒక్కసారి గమనిస్తే ఇతర మతాల వారు వారి వారి ప్రార్థనా మందిరాల్లో క్రమశిక్షణగా ఉంటుంన్నారు, ఏది చేసినా దైవం పేరిట చేస్తారు. మనల్ని చూసి ఇతరులు నేర్చుకున్నారు. అది మనం ఈనాడు మరచిపోతున్నాం.
ఆలయానికి వెళ్ళి మన గోత్ర నామాలతో చేస్తున్నాం ఎంత ఆశ్చర్యం చెప్పండి. మిగతావారు సమాజానికి తిండి పెట్టినా, బట్టలు ఇచ్చినా దేవుడి పేరు పెట్టి చేస్తారు. మనమో దేవుడికి నేనే పెడుతున్నా అని నామ గోత్రాలు వ్రాసి చేసే అలవాటు చేసుకుంటున్నాం. ఎంత విపరీతమో గమనిస్తున్నామా ? ఎంత ఆశ్చర్యమో తెలుసునా ? దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇస్తున్నా అని అనడం చేతకాక నాది నేను నీకు ఇస్తున్నా అని అన్నాడు బలిచక్రవర్తి. "తుబ్యమహం సంప్రపదే నం మమః " అన్నాడు. ఇది నీది కాదయా నాది చూడవయా అని బలి తలని కొలిచాడు. ధర్మం చేయాలి కానీ దైవం పేరున చేయాలి. ఆ దైవం పేరు చెప్పి సమాజానికి చేయాలి. అహంకారాన్ని వదిలి దర్పాన్ని వదిలి దంభాన్ని వదిలి వినయంతో చేయగలిగే స్థితిని మనకి ఆలయం నేర్పగలగాలి. అందుకే మన ఆలయాల స్థితిని పునరుద్ధరించుకునే అవసరం ఈవేళ ఉంది. చరిత్రకి మనం ఇచ్చే ప్రాధాన్యత ఎంత ? ఇది కాకూడదు.
మనలాంటి సామాన్యులకి ఈ విషయాలు గోచరించకపోయినా భగవంతునికి ఏ అపచారం జరిగినా తట్టుకోలేని మహానుభావులు ఉంటారు. అట్లాంటి మహనీయులే మన స్వామి వారు. అట్లాంటి మహనీయులు సూచించకపోతే మరెవరు వీటిని ఎత్తి చూపేది. ఇవి ఎత్తి చెపితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని సంఘాలని రెచ్చగొడుతున్నారు. అసలు చరిత్ర తెలిసిన వారేనా వీళ్ళంతా. ఎవడో మనల్ని పాళించిన పాశ్చాత్యుడు మీరంతా హిందువులు ఎక్కడో సింధూ నాగరికత మీది అని చెప్పి అంతకు ముందు మనకి ఒక చరిత్రలేదని చెబితే ఒప్పేసుకుంటున్నాం. ఇది మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. మనకంటూ కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది, మనం వైదికులం అని మరచి ఉన్నాం ఈనాడు. భగవత్సంబంధమైన చరిత్ర చిహ్నాలని నాశనం చేస్తున్నారని మన స్వామివారు భాద పడితే వారిలో ఉన్న దైవిక భావాన్ని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారు. కనీసం స్వరూప జ్ఞానం భగవత్ తత్త్వం తెలియని పెద్ద మనుషులని ( కేవలం వయసులోనే పెద్దలు) పెట్టి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చూపిస్తున్న టీవీ చానల్ల వాళ్ళకి ఆనాడు వేయికాళ్ళ మండపాన్ని కూలదీసినప్పుడు ఇలాంటి భాధ్యత లేకపోయిందా. మంచిని తృంచివేసి సమాజంలో చెడుని ప్రవర్తింపజేస్తే, ఆ చెడు ప్రభావం లోకంలో ఉన్నంతవరకూ నరకయాతనలు అనుభవింపక తప్పదని తెలియక కాబోలు వారు చేస్తున్నది.
భగవద్భక్తులు, ఆచార్యులు చూపే మార్గంలో మనం నడవలె కదా! శీనివాసునికి శంఖచక్ర క్రియాదులని నిర్వహించి భగవంతుని స్వరూపాన్ని లోకానికి ప్రకటించిన మహనీయులు భగవద్రామానుజులు. వారు అక్కడ ఆలయ సంస్కరణలని చేసి నియమాలని ఏర్పాటుచేసి వచ్చే భక్తులని అనుగ్రహించమని వేంకటేశుణ్ణి ప్రార్థించినందుకు కదా ఈ నాడు వేంకటేశును వచ్చిన ప్రతి భక్తుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. రామానుజుని నియమాలని తగినట్లుగా జరపాలని కోరుకొనే రామానుజ ప్రతిష్ఠాతా ధేను రక్షైక ధీక్షితులు మన స్వామివారు. రామాయణ ప్రవచనాల్లో మన స్వామి వారు చెప్పినట్లుగా జంతువులు, వానరులు, ప్రజలు, జనకుడు, కౌసల్యమ్మ, సీతమ్మ అంతా రామచంద్రునికి మంగళాశాసనం చేసారు, అట్లా మంగళాశాసనం చేసే సంప్రదాయం మనది కనుక వేంకటరమణుడికి మనము రక్షగా ఉందాం! వేంకటేశ్వరునికి మంగళాశాసనం చేద్దాం! రండి! దానికి మన స్వామివారు ఒక్కరే ఏకాంగవీరులై త్రిదండిదారులై ముందడుగు వేసారు. మనం రామాయణంలో తెలుసుకున్నాం ఎవరు శరణాగతి చేసినా ఫలిస్తుందని. శరణాగతి చేసిన భరతునికి 14 ఏళ్ళ తరువాత ఫలించింది, విభీషణునికి వెంటనే ఫలించింది. లక్ష్మీ విశిష్ఠమైన వేంకటేశ్వరుడు మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. మనం కూడా ఈ శరణాగతి దీక్షలో తరిద్దాం. మన పూర్వాచార్యుల శాసనాలని కాపాడుకుందాం.
మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మన స్వరూపాన్ని గుర్తుకు చేసిన మన జీయర్ స్వామి వారి వైభవాన్ని నలువైపులా చాటుదాం.
అడిఏన్ శ్రీనివాస రామానుజ దాస
శశి కిరణ్ రామానుజ దాస
|
Sri Ashtalakshmi Temple |
|
For priest services contact: (281) 498-2344
Published in
North America
Wednesday, 07 December 2011 11:20
2012 Panchangam - Theme: Swami Ramanuja and shrines blessed by SwamiJet Bangalore is happy to announce that they have made calendar for 2012 with a good informative message for every month on Swami Ramanujacharya activities in Karnataka. Since 2017 is Ramanujacharyas 1000th Tirunakshatra, we want to make people aware of glorious activities done by the great acharya. It is a 4 months effort of volunteers and the calendar has received mangalasasanams from His Holiness Thridandi Srimannarayana Ramanuja Chinna Jeeyar Swamiji. The contents of the calendar are in English hence it is suitable for devotees all around the globe.
For odering calendars in bulk please goto https://docs.google.com/spreadsheet/viewform?formkey=dDI3WFFPTHRob3F0Vktra2hmcnRqSGc6MQ
It was planned as 10 Dolors per each in US where as 10Euros may be in Europe. The collected funds are used for the Blind school and Tribal school activities of Jeeyar Education Trust. So we need atleast a responsible person from each city who can distribute and collect funds.
Please Contact: Sri Shashi Kiran Rao, Bangalore. Email: shashikiran.rao [at] gmail.com
Published in
Book/CD releases
Tuesday, 06 December 2011 09:53
Message from HH Srimannarayana Chinna Jeeyar Swami
Jai Srimannarayana! Priya Bhagavad Bandhus,
A very happy Githa Jayanthi to you all our Bhagavad Bandhus! May Lord of this Universe bless you all to be instrumental in executing His orders well for the benefit of His children!
Published in
General Announcements
Monday, 05 December 2011 17:40
Why do we need Scriptures?Now a days we can observe that there are either no rains or heavy rains. Nature is behaving in extreme way, who is the reason for it? We should accept that the defect lies in us but not in nature. Not only limited to rains, any natural calamities we are only reason but not the nature. If at all nature has any anger on us, it would have taken us out of this earth very long before. If it really wants it don’t need a single minute to swallow us. But nature does not have any anger on us. Nature loves us always. Nature is behaving as if its duty is to correct our mistakes as like any mother.
Published in
Miscellaneous
|